Saturday, August 9, 2008

మా పెళ్ళిరోజు

శ్రీరస్తు...శుభమస్తు...శ్రీరస్తు...శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం..... అంటూ ఆగస్టు 20న 2005లో మా పెళ్ళి జరిగింది. ఎక్కడోపుట్టి పెరిగి ఒకరికి ఒకరుగా ముడివేసే ఈ బంధం ప్రతీఒక్కరి జీవితంలో అత్యద్బుతమైన అనుభూతి. మాపెళ్ళి జరిగి అపుడే 3సంలు అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. మొన్నమొన్ననే మా వారు నన్ను చూసుకోవడానికివచ్చినట్లు, చుట్టాలు, స్నేహితులు వచ్చివెళ్లే అతిదులతో మా మమ్మీ,డాడీ హడావిడి తరువాత అన్నవరం సత్యనారాయణ స్వామివారి సన్నిదిలో వ్రతం చేసుకోవడం, అక్కడ నాచీర(కంచిలో నేయించిన పట్టుచీర) తో మెట్లు ఎక్కలేక నడవలేకుంటే మావారు, అత్తమ్మ, అక్క నన్ను చిన్నపిల్లలా చూసుకోవడం అన్నీ నా కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఈబ్లాగు ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తూంటే నాకు మాపెళ్ళిరోజు గుర్తుకొచ్చి ఇలా సరదాగా రాస్తున్నాను.

ఈ20న మమ్మల్ని పెద్దలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ....

No comments: