Monday, August 11, 2008

ఒలింపిక్స్ లో భారత్ గోల్డ్ మెడల్

చూస్తున్నారా! చైనాలో ఒలింపిక్స్ మొదలుపెట్టడమే చాలా అద్బుతంగా బాణాసంచా,విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్నారు. నేనయితే అటువంటి విన్యాసాలు ఇంతకుముందు చూడలేదు. రోజూ చూస్తున్నా మనవాళ్ళు ఎలా ఆడతారోఅని, వాళ్ళెలా టెన్షన్ పడుతున్నారోకాని నేను మాత్రం చూస్తూనే నేనేదో ఆడేస్తున్నట్టు టెన్షన్ పడుతున్నాను. చాలా చక్కగా ఆడుతున్నారంతా. 'బింద్రా' ఛండీఘడ్ అతను మనభారత్ కు మొదటి గోల్డ్ మెడల్ తెచ్చేసాడు. నాకెంతో ఆనందం వేసింది. వెంటనే మీఅందరితో పంచుకోవాలని ఈటపా రాసాను. మనవాళ్ళకి శుభమే జరగాలని కోరుకుంటూ...

మీకోవిషయం చెప్పడం మరిచా! అక్కడ రెస్టారెంట్స్ లో ఆహారం ఏమిటో తెలుసా! వామ్మో తేళ్ళు, బల్లులకాళ్ళు,పురుగులు,మిడతలు, స్టార్ ఫిష్లు, పాములు మొదలగునవి. తలుసుకుంటేనే ఏదోలాగ అది వర్ణించలేనిది.
ఇక్కడ ఒలింపిక్స్ మొదటిరోజు విన్యాసాలు చూడగలరని ఆశిస్తూ..
http://www.metacafe.com/watch/1601148/2008_beijing_olympic_opening_ceremony/

No comments: