మా చిన్నప్పుడు వేసవి సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసేవాళ్ళమండి. అందరం అంతేలెండి. ఆసెలవుల్లో మనల్ని ఎవరూఏమి అనరు. మనం ఎంత అల్లరిచేసినా అమ్మమ్మా,తాతయ్యలు ఏమీ అనకపోవడమేకాకుండా అనడానికి వచ్చిన వాళ్ళమీద యుద్దం ప్రకటిస్తారు.
మేము మా చిన్నపుడు సెలవులు ఇస్తే వెంటనే అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మా నాన్నమ్మ, మా డాడీ చిన్నప్పుడే చనిపోయింది. సెలవుల్లో అమ్మమ్మ ఇంట్లో, మామయ్య పిల్లలు(ముగ్గురు అమ్మాయిలు),మా అక్క,నేను, ఇంకో మామయ్య (అమ్మ కజిన్) కొడుకు బాగా ఆడుకునేవాళ్ళం. ఆరోజులే వేరు. ఈకాలంలో పిల్లలకి అంత ఖాళీ ఎక్కడా. సెలవులు ఇస్తే వెంటనే తరువాత క్లాస్ సిలబస్ మొదలుపెట్టేస్తున్నారు. ఈపిల్లల్ని తలచుకుంటే నాకు ఎంతో భాద వస్తోంది. సరేలెండి.
మా అమ్మమ్మా వాళ్ళ ఊరు చిన్న పల్లెటూరు. ఎంతో అందంగా వుండేది. అక్కడ మాపొలల్లో చేల గట్టులంటా తిరుగుతూ, మామిడికాయలు కోయడాలు, ముంజికాయలు, కొబ్బరి బోండాలు తాగి అక్కడ ఆడుకొనేవాళ్ళం. గాలిపటాలు ఎగరేయడాలు నాది పైకి అంటే నాది పైకి అని అల్లరి చేయడాలు, కళ్ళగంతలు, సైకిల్ నేర్చుకోవడాలు పడిపోవడాలు ఇలా ఎన్నెన్నో. ఒకసారి మా పొలంలో ఆవుకి దూడ పుట్టి కొన్నివారాలు అయ్యిందని మా తాతయ్యగారు చెబితే నాకు చిన్న దూడలంటే ఎంతో ఇష్టం అందువల్ల వెళ్ళి దానితో నేను ఆటలాడుతూంటే వాళ్ళమ్మకి పిచ్చకోపం వచ్చి నన్ను పరిగెత్తించింది చూడండీ...ఓరి దేవుడా! అని నేనెపుడు అంతలా పరిగెడతానని నాకే తెలియదు ప్రాణం మీద ఆశతో ఇంతలో నేనెల్లి బోదిలో పడ్డా. మా పొలం లో పనిచేసే అతను వచ్చి దాన్ని పట్టుకున్నాడులెండి. అదే నేనుదొరికుంటే నాతో ఆడుకునేది. అప్పట్నుంచి నాకు ఆవులు, గేదెలు అంటే చాలా భయం. మా తాతయ్య గారికి మేమంతా వచ్చామంటే భలే సరదా, ఆనందంగా అందరితో చెబుతూవుండేవారు. అప్పుడు పల్లెటూర్లలో వారానికి ఒకరోజు సంతలుండేవి. కూరగాయలు, పళ్ళు అన్నీ తాజాగా,అ..అ.. మరిచా ఒకతను జిలేబి,మిరపబజ్జి చేసేవాడండీ..సూపర్. మాకోసం దగ్గరుండి చేయించి తెచ్చేవారు.
ఇంక సాయంత్రం అవ్వగానే అందరం స్నానాలు చేసేసి ఒక్కొక్కళ్ళు ఒక్కో మడతమంచం పెరట్లో వేసుకుని (ఇంటికి చుట్టూ పెద్ద ప్రహారీ గోడ వుంది) దగ్గరలో వున్న గుడిలోంచి పాటలు వస్తూ ఉంటే మేము అంత్యక్షరీ, మంచాలచుట్టు పరిగెత్తే ఆటలు ఆడుతూవుంటే ఇంతలో అమ్మమ్మ, చిన్నాక్క(మా తాతయ్య గారి నలుగురి అన్నయ్యల్లో నాలుగో అన్నయ్య భార్య) మాకు భోజనాలు తినిపించేవారు. చిన్నక్క అని మా అమ్మమ్మ పిలిసేది. అది మా అమ్మకు,మాకూ అలానే అలవాటయిపోయింది. మేమంటే చాలా ఇష్టం. ఆ తరువాత ఆకాశంలో నక్షత్రాలతో ఆటలు, కథలు చెప్పుకొనేవాళ్ళం. అలా చక్కగా గడిపేవాళ్ళం. ఆ రోజులు ఇప్పుడు అందరం కలిసినపుడు తలుసుకుంటే ఎంతో హాయిగా,ఆనందంగా ఉంటుంది. ఆకథలు వచ్చే టపాలో.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
చిరంజీవి జ్యోతీ,
నీ వేసవి కబుర్లు చదివిన వెంటనే మా బాల్యం గుర్తుకు వచ్చింది. కావాలంటే నా బ్లాగులో మా వేసవి కబుర్లు, నేటి బాలలు కోల్పోతున్న బాల్యపుసంగతులుంటాయి. నా బ్లాగుకోసం చూడు(search 'drpvsnp.wordpress.com'; drpvsnp.blogger.com) .అన్నట్టు నీవు వుంచిన కార్టూన్ కూడా చాలా అర్ధవంతంగా ఉంది.
Dr.P.V.S.N.Prasad.
నా కామెంట్ లో చిన్న తప్పు: drpvsnp.blogger.com బదులుగా drpvsnp.blogspot.com చదువుకో.
Post a Comment